నా బయోపిక్ నేనే తీసుకుంటా! నా లవ్ స్టోరీలో మంచి మసాలా ఉంది!!
on May 18, 2021
ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా బయోపిక్ లు వచ్చాయి. హీరోలు, రాజకీయనాయకులు, స్వాతంత్య్ర యోధులు ఇలా చాలామందిపై బయోపిక్ లు వచ్చాయి, వస్తున్నాయి. అయితే ఇప్పుడు యాంకర్ అనసూయ కూడా డబ్బు బాగా ఉన్నప్పుడు తనపై తానే బయోపిక్ తీసుకుంటానని చెబుతోంది. తన లవ్ స్టోరీలో మంచి మసాలా ఉందని.. దాన్ని దట్టించి బయోపిక్ తీస్తానంటూ చెప్పుకొచ్చింది. తన లవ్ స్టోరీ, పెళ్లి, పిల్లలు వంటి అంశాలపై స్పందించింది అనసూయ.
చిన్నప్పుడు తన తల్లి బాగా పూజలు చేసేదని.. తను కూడా తల్లితో కలిసి టెంపుల్స్ కి తిరిగేదాన్ని అని చెప్పుకొచ్చింది. ప్రేమించిన వాడితో పెళ్లి జరగాలని తెగ పూజలు చేశానని.. ఏడేళ్ల పాటు చాక్లెట్, ఆలు గడ్డ తినలేదని.. సాయిబాబాకు వదిలేశానని తెలిపింది. తన భర్తే తన ప్రపంచమని.. ఎన్‌సీసీ క్యాంప్ లో అతడిని కలిసినట్లు.. అది చాలా పెద్ద కథ అని.. బాగా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు తన లవ్ స్టోరీతో బయోపిక్ తీస్తానని.. తన లైఫ్ లో చాలా మసాలా ఉందని, ఎంటర్టైనింగ్ గా ఉంటుందని చెప్పుకొచ్చింది.
పెళ్లి సమయంలో ఎన్నో ఇబ్బందులు పడినట్లు.. సాక్షిలో జాబ్ చేస్తున్నప్పుడు కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నట్లు చెప్పింది. ఇక పిల్లల గురించి మాట్లాడుతూ.. ఓ పాపని కనాలనుందని చెప్పింది. ఆడబిడ్డను కనడం, పెంచడం పెద్ద ఛాలెంజ్ అని చెప్పిన అనసూయ తనకు 40 ఏళ్లు రాగానే కూతుర్ని కనడానికి ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చింది. కూతుర్ని కనేప్పుడు చాలా వరకు తన వర్క్ ను పాపకి డెడికేట్ చేస్తానని చెప్పింది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
